నట గురువు దేవదాస్‌ కనకాల కన్నుమూత

Devadas Kanakala
Devadas Kanakala

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాల టాలీవుడ్ లో పేరున్న నటుడు కాగా, ఆయన కోడలు సుమ అగ్రశ్రేణి యాంకర్ గా పేరుతెచ్చుకున్నారు. 1945 యానాంలో జన్మించిన దేవదాస్ కనకాల నటుడిగానే కాకుండా, నటనా శిక్షకుడిగా సైతం ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన అర్ధాంగితో కలిసి యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ పెట్టి రజ నీకాంత్‌.. చిరంజీవి… రాజేంద్రప్రసాద్‌ మొదలుకొని ఎంతోమంది నటుల్ని తీర్చిదిద్దిన గురువు. వందకి పైగా చిత్రాల్లో నటించి గుర్తుండిపోయే పాత్రలకి ప్రాణ ప్రతిష్ట చేసిన  ప్రతిభాశాలి. వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా తన కథలతో రంజింపజేసిన దర్శకుడు.. దేవదాస్‌ కనకాల. అనేకమందిని చిత్ర పరిశ్రమకు అందించారు. నటుడిగా సిరిసిరిమువ్వ, గోరింటాకు, మంచుపల్లకి వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన చివరగా నటించిన చిత్రం ‘భరత్ అనే నేను’
కాగా దేవదాస్‌ కనకాల పార్థివ దేహాన్ని శనివారం ఉదయం మణికొండలోని ఆయన స్వగృహానికి తీసుకెళతారు. 11.30 తర్వాత దహన సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/