ఢిల్లీలో కలకలం ఏసీపీ ఆత్మహత్య

న్యుఢిల్లీ : ఢిల్లీలో తీవ్ర కలకలం ఓ పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీపీ ర్యాంకు అధికారి ప్రేమ్ వల్లభ్ పోలీస్ ప్రధాన కార్యాలయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 55 ఏళ్ల ఆయన ఢిల్లీ పోలీస్ శాఖలోని క్రైమ్, ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. 1986లో హెడ్ కానిస్టేబుల్‌గా చేరిన వల్లభ్ 2016లో ఏసీపీగా పదోన్నతి పొందారు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఇటీవల 28 రోజుల పాటు ఆస్పత్రిలో చేరారని ఆయన సహచరులు వెల్లడించారు. అదే కారణంతో ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ శాఖలోని సీనియర్ అధికారులకు వ్యక్తిగత సహాయకుడిగా ఆయన పనిచేసినట్టు ఓ అధికారి పేర్కొన్నారు.