సంగారెడ్డి జిల్లాలో దారుణం : యువకుడి ఫై మరో యువకుడు యాసిడ్ దాడి

మాములుగా యాసిడ్ దాడి అంటే..యువతీ ఫై యువకుడు యాసిడ్ దాడి చేయడం వంటివి ఇప్పటివరకు జరిగాయి. కానీ తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో మాత్రం యువకుడి ఫై మరో యువకుడు యాసిడ్ దాడి చేసాడు.

వివరాల్లోకి వెళ్తే..

విజయ డైరీలో పనిచేస్తున్న అజయ్, దత్తు స్నేహితులు. వీరిద్దరి మధ్య తాజాగా గొడవ జరిగింది. యువకులిద్ధరూ ఒకరిపై ఒకరు మాటలు రువ్వకున్నారు. అంతటితో ఆగకుండా కొట్టుకున్నారు. ఈ క్రమంలో గొడవ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అజయ్ ..దత్తుపై యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో అజయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అజయ్ ని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.