బంతి తగిలి కుప్పకూలిన శ్రీలంక మహిళా క్రికెటర్‌

woman cricketer fell down by hitting ball
woman cricketer fell down by hitting ball

అడిలైడ్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న సన్నాహక మ్యాచ్‌లో శ్రీలంక మహిళా క్రికెటర్ అచిన కులసురియా తీవ్రంగా గాయపడింది. ఫీల్డింగ్ చేస్తూ బంతిని తప్పుగా అంచనా వేయడంతో అదికాస్త నేరుగా కులసురియా నెత్తినపడింది. తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలో కుప్పకూలిపోయింది. దాంతో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించిన టీమ్ ఫిజియో..కులసురియా పరిస్థితి విషమంగా ఉందని గ్రహించి హుటాహుటిన స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కులసురియా… దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రయాన్‌ కొట్టిన బంతిని తప్పుగా అంచనా వేసి గాయపడింది. బంతి బలంగా తాకడంతో మోకాళ్లపై కూలబడిపోయిన కులసురియా చేతులతో నెత్తిన పట్టుకొని విలవిల్లాడిపోయింది. ఆమెను వెంటనే తదుపరి పరీక్షల కోసం రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి జట్టుతో చేరిందని శ్రీలంక అధికారప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/