అలాగైతేనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం

Ey company
Ey company

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ లక్షం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం కావాలంటే 9 శాతం వృద్ధి రేటు భారత్‌కు అవసరమని ఇవై అనే సంస్థ పేర్కొంది. వరుసగా ఐదు సంవత్సరాల పాటు 9 శాతం వృద్ధిని సాధించాలని, అదే సమయంలో మొత్తం పెట్టుబడి రేటును జిడిపిలో 38 శాతానికి పెంచాల్సి ఉంటుందని ఖఎకానమి వాచ్గ తాజా ఎడిషన్‌లో ఇవై తెలిపింది. 2020 మార్చి 31 ముగింపునాటి ఆర్థిక సంవత్సరంలో దేశం ఏడు శాతం వృద్ధి రేటును సాధిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుత 2,700 బిలియన్ డాలర్ల నుండి 3,000 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఇవై వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా ఐదు సంవత్సరాలు 9 శాతం వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉందని, 202021లో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3,300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఆ సంస్థ తెలిపింది.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/