మంత్రి బొత్సకు అచ్చెన్నాయుడు సవాల్‌

ఎవరి ముసలి వాళ్లో-ఎవరో యువకులో చిన్న పోటీ పెడదాము

acham naidu
acham naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారయణకు మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. ఇటీవల మంత్రి బొత్స సత్యనారయణ మీడియాతో మాట్లాడుతూ..టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముసలివారు అయిపోయారంటూ సెటైర్లు వేశారు. దీనిపై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. గౌరవ మంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారయణ గారు- ప్రతి పక్షనాయకుడు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముసలి వారు అయ్యారని వ్యంగ్యంగా అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఎవరు ముసలి వాళ్లో- ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదాము…బొత్స సత్యనారయణ గారు ( ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ క్యాబినెట్‌లోని ఏ మంత్రిగారైనా సరే) చంద్రబాబు గారి కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి? ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్లు…మిగిలిన వారు ముసలోళ్లు!! అని సవాల్‌ విసిరారు. ఇంకా ఈ పోటీకి బొత్సగారూ సిద్దమేనా! పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని పత్రికా సమావేశంలో ఒప్పుకోండి అని ట్విట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/