జగన్ లెంపలేసుకుని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ అచ్చెన్నాయుడు డిమాండ్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కాస్త వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడం ఫై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరుణంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అనుకుని ఉంటే వైఎస్సార్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంత ప్రమాదకరమో ముఖ్యమంత్రి జగన్ కు అర్థంకావడంలేదని అన్నారు.

టీడీపీ హయాంలో చంద్రబాబు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి వైఎస్సార్ పేరు తొలగించలేదని వెల్లడించారు. సీఎం జగన్ లెంపలేసుకుని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ బిల్లును ఉపసంహరించుకునేంత వరకు టీడీపీ పోరాడుతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మరోపక్క టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం నిర్ణయంపై ఎన్టీఆర్‌ అభిమానుల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది. ఎన్టీఆర్‌ పేరును ఎలా తీసేస్తారంటూ ఆందోళనలు చేస్తున్నారు. విజయవాడ గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు మాజీ మంత్రి దేవినేని ఉమ. అటు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మనస్తాపం చెందారు. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు యార్లగడ్డ ప్రకటించారు.