చింతలపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపుఫై అచ్చెన్నాయుడు ఫైర్

TDP AP president Atchannaidu

ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపుఫై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తూ, ధ్వంసం చేస్తూ వైస్సార్సీపీ గూండాల వికృతానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌కు అవమానాలు ఎదరయ్యాయన్నారు. ప్రభుత్వ ఉదాసీనతే ఇలాంటి ఘటనలకు కారణమన్నారు. ఒక్క దుండగుడిపైనా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ఆయన ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై ప్రజలు ఆగ్రహించిన ప్రతిసారీ వారి దృష్టి మళ్ళించేందుకు ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరే ఇలాంటి ఘటనలకు కారణం. గతంలోనూ ఎన్టీఆర్‌ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇలాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడిన వారిలో ఒక్కరిపైన అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలపై ఆఘమేఘాల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్న పోలీసులు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్‌ విగ్రహాలను తొలగిస్తున్న వారిపై ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? అధికార పార్టీకి ఒక న్యాయం మాకో న్యాయమా? వైస్సార్సీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇలాంటి ఘటనలు పునరావతమవుతున్నాయని మండిపడ్డారు.