ఆచార్య నుండి సిద్ధా టీజర్ వచ్చేస్తుంది

ఆచార్య నుండి మెగా పవర్ అప్డేట్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా..ఆయనకు జోడి గా పూజా హగ్దే నటిస్తుంది.

ఈ సినిమాలో సిద్ధా గా నటిస్తున్న రామ్‌ చరణ్‌ కు సంబదించిన టీజర్‌ ను నవంబర్‌ 28 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో రామ్‌ చరణ్‌ పెద్ద గన్‌ పట్టుకుని… చాలా ఆవేశంగా కనిపించాడు. అటు మెగాస్టార్‌ చిరంజీవి కూడా చాలా కోపంగా కనిపించాడు. ఇక తాజాగా అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.