ఆచార్య నుండి ‘భలే భలే బంజారా’ సాంగ్ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న మెగా మూవీ ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో చిత్ర ప్రమోషన్స్ ఫై దృష్టి సారించిన మేకర్స్…ఈరోజు సోమవారం చిత్రంలోని భలే భలే బంజారా సాంగ్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

మామూలుగానే చిరంజీవి, రామ్‌చరణ్‌ల డ్యాన్స్‌ చూసి మెగా ఫ్యాన్స్ ఉగిపోతుంటారు. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేస్తే అది అభిమానులకు పండుగే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి విజువల్‌ ట్రీట్‌నే ఇచ్చారు మేకర్స్‌. ఈ పాటలో చిరంజీవి, రామ్‌చరణ్‌లు పోటీ పడి డ్యాన్స్‌ చేయడం అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ రిలీజ్ సందర్బంగా చిరంజీవి , చరణ్ లు ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ”నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఇది. ‘భలే భలే బంజారా’ కోసం నా ఎనర్జిటిక్ రామ్ చరణ్ తో కలిసి కాలు కదపడం ఎంతో సంతోషంగా ఉంది. నా గ్రేస్ తో నేను అతన్ని డామినేట్ చేశానని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేయగా..”నిస్సందేహంగా ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాట. మా నాన్న నా #ఆచార్య చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ చేయడంలోని ఆనందాన్ని గౌరవాన్ని మాటల్లో చెప్పలేను” అని రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను లెజెండ్ సింగ‌ర్ శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, టాలీవుడ్ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిరంజ‌న్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

YouTube video