నేరాన్ని అంగీకరించని సమత కేసు నిందితులు
తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపణ

అసిఫాబాద్: కొమురం భీం జిల్లాలో అత్యంత దారుణం హత్యాచారానికి గురైన సమత కేసులో నిందితులు నేరాన్ని అంగీకరించడంలేదు. హత్యాచారానికి పాల్పడింది తాము కాదని, తమపై తప్పుడు కేసులను బనాయించారని నిందితులు కోర్టుకు తెలిపారు. అసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో గట్టి బందోబస్తు నడుమ నిందితులను పోలీసులు హాజరు పరిచారు. అయితే చార్జీషీట్ ఆధారంగా రూపొందించిన 52 ప్రశ్నలను న్యాయస్థానం నిందితులను ప్రశ్నించింది. తాము నిర్దోషలమని, తమకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ ముఖ్దూంలు న్యాయస్థానానికి తెలిపారు. కాగా ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం విచారణను ఈ నెల ఆరవ తేదీకి వాయిదా వేసింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/