ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 10 మంది మృతి

ఇంటి నుండి బయకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చేవరకు ఇంట్లో వారికీ టెన్షనే. నిత్యం రోడ్డు ప్రమాదాలు ఎంతోమందిని బలి తీసుకుంటున్నాయి. అతివేగం , మద్యం సేవించి డ్రైవ్ చేయడం , నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వంటి వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం 10 మందిని బలి తీసుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని పీలీభీత్‌ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఓ డీసీఎం అదుపుతప్పి చెట్టును ఢీకొనగా.. 10 మంది యాత్రికులు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గజ్రౌలా పోలీస్​ స్టేషన్​ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 మంది హరిద్వార్​లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అంతకు ముందు రాష్ట్రంలోని హమీర్​పుర్​లో జరిగిన ఓ ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మౌదహా మాక్రావాన్​లోని జాతీయ రహదారి-34 వద్ద ఈ విషాదం జరిగింది. మామిడి పండ్ల లోడ్​తో వెళ్తున్న ఓ ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. ఇలా ఒకేరోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఉత్తర ప్రదేశ్ సీఎం విచారం వ్యక్తం చేశారు.