సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదం.. 35 మంది మృతి

మృతులంతా విదేశీయులే

road accident
road accident

మదీనా: సౌదీ అరేబియాలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా విదేశీయులే. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు మదీనా ప్రావిన్స్‌లోని అల్ అఖల్ సెంటర్ వద్ద భారీ వాహనాన్ని ఢీకొట్టింది. మక్కా సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో ఆసియా, అరబిక్ దేశాలకు చెందిన వారున్నట్టు సమాచారం.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/