కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయండి

వర్చువల్‌ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో సమీక్ష

PM Modi
PM Modi

New Delhi: కరోనాకేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో చర్చలు జరిపారు.
ఇంటింటికీ పరీక్షలు, నిఘాపై దృష్టి పెట్టడానికి గ్రామీణప్రాంతాల్లో ఆరోగ్యసంరక్షణ వనరులను పెంచాలని ప్రధాని మోదీ సూచించారు. గ్రామీణప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాపై దృష్టిసారించాలని ఆదేశించారు. వెంటిలేటర్లు,ఇతర పరికరాల ఉపయోగించడంలో ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని తెలిపారు.

రాష్ట్ర, జిల్లాస్థాయిలో కరోనా పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్ లభ్యత,వివరాలను అధికారులు ప్రధానికి వివరించారు. మార్చి ప్రారంభంలో వారానికి 50 లక్షల టెస్టుల నిర్వహించగా..ప్రస్తుతం వారానికి 1.3 కోట్ల టెస్టుల వరకు పెరిగాయని ప్రధానికి తెలిపారు. క్రమంగా పాజిటివిటీ రేటు తగ్గుతోందని, రికవరీ రేటు పెరుగుతోందని అధికారులు మోదీకి వివరించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/