ఓటుకు నోటు కేసు విచారణ మళ్లీ వాయిదా

విచారణ వచ్చే నెల 20వ తేదీకి వాయిదా

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై ఈ రోజు విచారణ చేపట్టిన ఏసీబీ స్పెషల్ కోర్టు.. విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ1గా ముద్దాయిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నందున ఆయన్ను కోర్టులో హాజరుపర్చలేదు. మిగతా నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో కూడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారులకు సంబంధించిన కీలక విషయాలను చార్జిషీట్‌లో అధికారులు పొందుపరిచారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/