TSPSC వద్ద ఉద్రిక్తత : ABVP కార్యకర్తల అరెస్టు

TSPSC పేపర్ లీక్ ఘటన ఫై యావత్ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రాసిన పోటీ పరీక్షలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బుధువారం TSPSC ఆఫీస్ వద్ద ABVP కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

‘ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి. ప్రశ్నాపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి.’ అంటూ ఏబీవీపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ..TSPSC లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. ఇందులో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.

పేపర్ లీకేజీ ఘటనకు బాద్యత వహిస్తూ, సీఎం కేసీఆర్, టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. TSPSC ని మొత్తం ప్రక్షాళన చేయాలన్నారు. మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని కోరారు.