అభినందన్‌ను భారత్‌ హైకమిషన్‌కు అప్పగింత

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ అదుపులో ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ను ఈరోజు విడుదల చేస్తున్నట్లు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అభినందన్‌ను పాకిస్థాన్‌ అధికారులు ఇస్లామాబాద్‌లోని భారత్‌ హైకమిషన్‌కు అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం
3-4 మధ్య ఆయన అట్టారీవాఘా జాయింట్ చెక్‌పోస్టు మీదుగా స్వదేశంలో అడుగుపెట్టనున్నారు.