త్వరలో విధుల్లో చేరునున్న అభినందన్‌!

Abhinandan Varthaman
Abhinandan Varthaman

న్యూఢిల్లీ: భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్ వర్ధమాన్‌ త్వరలో మిగ్‌20 యుద్ధవిమానాన్ని నడపనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అభినందన్‌ రాజస్థాన్‌లోని ఓ వైమానిక స్థావరంలో గ్రౌండ్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నారు. అయితే పలు దఫాల వైద్య పరీక్షల అనంతరం ఆయన శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉన్నట్లు బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ ధృవీకరించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి విధుల్లో చేరే ముందు నిబంధనల ప్రకారం మరోసారి ప్రాథమిక పరీక్షలు చేసే అవకాశం ఉంది. కొన్ని నెలల పాటు విధులకు దూరంగా ఉన్నందున అభినందన్‌ను స్వల్పకాలిక శిక్షణా కోర్సుకు పంపే అవకాశం ఉందని భారత వాయుసేనకు చెందిన ఓ అధికారి తెలిపారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/