ఐసిస్‌ కొత్త చీఫ్‌గా అబ్దుల్లా ఖర్దాష్‌ నియామకం

గతంలో సద్దాం హుస్సేన్ వద్ద మిలిటరీ అధికారిగా విధులు

abdullah-kardashian
abdullah-kardashian

సిరియా: అమెరికన్ సైన్యం వైమానిక దాడులు జరిపి, తనను చుట్టుముట్టిన వేళ, వారికి చిక్క కూడదన్న ఉద్దేశంతో తనను తాను పేల్చేసుకుని ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ హతమైన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఐసిస్ కు కొత్త వారసుడి నియామకం జరిగిపోయింది. అబ్దుల్లా ఖర్దాష్ ను బాగ్దాదీకి వారసుడిగా, ఐసిస్ కొత్త అధినేతగా నియమించినట్టు తెలుస్తోంది. సైనికుల దాడి తరువాత బాగ్దాదీతో పాటు ఉగ్రవాద సంస్థ అధికార ప్రతినిధి అబూ అల్ హసన్ అల్ ముహాజీర్ కూడా హతుడైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సంవత్సరం ఆగస్టులోనే తనకేదైనా జరిగితే వారసుడిగా అబ్దుల్లా ఖర్దాష్ అలియాస్ హాజీ అబ్దుల్లా అల్ అఫ్తారీని నియమించాలని బాగ్దాదీ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సద్దాం హుస్సేన్ బతికున్న సమయంలో ఇరాక్ మిలటరీ అధికారిగా అబ్దుల్లా ఖర్దాష్ పని చేశాడు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/