ఆరోగ్య సేతు యాప్‌లో వ్యక్తిగత సమాచార గోప్యతపై కేంద్రం పూర్తి క్లారిటీ

సరికొత్త ప్రొటోకాల్ విడుదల

Aarogya Setu App
Aarogya Setu App

New Delhi: ఆరోగ్య సేతు యాప్‌లో వ్యక్తిగత సమాచార గోప్యతపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ దీనిపై కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. 

  • ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా ప్రజల నుంచి సేకరించే సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారు.. ఎలా షేర్ చేసుకుంటారు అనే దానిపై సరికొత్త ప్రోటోకాల్ విడుదల చేసింది. 
  • ‘ఆరోగ్య సేతు డేటా యాక్సిస్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ప్రోటోకాల్ 2020’ పేరుతో విడుదల చేసిన ఈ ప్రోటోకాల్‌ కింద.. ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితి గురించి, ఎవరెవరిని కలిశారన్న దాని గురించి చెప్పిన సమాచారాన్ని వినియోగించడానికి వీల్లేదు. 
  • ప్రజారోగ్యంపై ప్రభుత్వం వద్ద తగిన సమాచారం కోసం, తదనుగుణంగా తీసుకునే నిర్ణయాల కోసం మాత్రమే దీన్ని వినియోగిస్తారు. 
  • కాగా ఈ సమాచారం 180 రోజుల వరకు ఉంటుందనీ.. కావాలంటే వినియోగదారులు పేరు, మొబైల్ నంబరు, వయసు, జెండర్, వృత్తి, ట్రావెల్ హిస్టరీ సహా డీమోగ్రాఫిక్ డేటా (జనాభా వివరాలు) డిలీట్ చేసేలా కోరవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. 
  • ఎన్‌ఐసీ సేకరించిన డిమోగ్రాఫిక్ డేటాను మాత్రం ఈ ప్రోటోకాల్ అమల్లో ఉన్నంత వరకు ఉంచాలనీ.. లేదా వినియోగదారులు కోరిన 30 రోజుల్లోగా దాన్ని డిలీట్ చేయాలని స్పష్టం చేసింది.
  • అలాగే ఎలాంటి డేటా షేరింగ్‌ కోసమైనా ఎన్‌ఐసీ సహేతుకమైన కారణాన్ని చూపించాల్సి ఉంటుంది. 
  • ఆ డేటాను ఏయే సంస్థలతో షేర్ చేసుకున్నారనే దానిపై ఎప్పటికప్పుడు జాబితాలో పొందుపర్చడం తప్పని సరి. 
  • కాగా కరోనావైరస్ సోకిన వారిని ట్రేస్ చేసేందుకు, వారి ద్వారా మరొకరికి వైరస్ సోకకుండా వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు కేంద్రం ఆరోగ్య సేతు యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 
  • తాజాగా ఇప్పుడు దీన్ని ఈ-పాస్‌లు జారీ చేసేందుకు, టెలీమెడిసిన్ సదుపాయం పొందేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. 
  • రైల్వే, విమాన ప్రయాణాలు సహా ఉద్యోగం నిమిత్తం రాకపోకలు సాగించే వారికి ఈ యాప్‌‌ను తప్పనిసరి చేశారు. 

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/