బిజెపి ప్రతికూల జాతీయవాదం అనుసరిస్తోంది

ఆప్‌ మాత్రం ప్రేమ, గౌరవమే లక్ష్యంగా ముందుకెళ్తోంది

Gopal Rai
Gopal Rai

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయంతో మంచి జోష్‌ మీద ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా తమ పార్టీ విస్తరణపై దృష్టి సారిస్తుంది. ఇకపై దేశంలో జరిగే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్ మాట్లాడుతూ..పంజాబ్‌తో పాటు ఇతర అసెంబ్లీ ఎన్నికలపైనా కేజ్రీవాల్‌ దృష్టి పెట్టనున్నారన్నారు. పార్టీని విస్తరించుకోవడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి వాలంటీర్లను సిద్దంచేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలిపారు. ద్వేషం, విభజన రాజకీయం వంటి అంశాలతో బిజెపి ప్రతికూల జాతీయవాదం అనుసరిస్తోందని ఆరోపించారు. ఆప్‌ మాత్రం ప్రేమ, గౌరవమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ సానుకూల జాతీయవాదాన్ని అనుసరిస్తోందన్నారు. ఢిల్లీలో ఆప్‌ చేసిన ప్రయోగం యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాయ్ అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/