ఆధార్‌తో పాన్‌ అనుసంధానానికి గడువు పొడిగింపు

మార్చి 31కి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం

aadhaar pan
aadhaar pan

న్యూఢిల్లీ: ఆధార్‌తో పాన్ నంబరు అనుసంధానానికి ఉన్న డెడ్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డిసెంబరు 31 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను మార్చి 31కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 31 లోగా పాన్‌ను ఆధార్‌తో జత చేసుకోవాలని, లేకపోతే పాన్ కార్డు రద్దు అవుతుందని గతంలో పేర్కొంది. అయితే తాజాగా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి మరోమూడు నెలలు పెంచింది. కాగా, ఇలా పొడిగించడం ఇది 8వ సారి. పాన్ఆధార్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా చెబుతోంది. అనేక సార్లు డెడ్ లైన్స్ విధించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/