మార్చి 31 లోగా ఆధార్‌-పాన్‌ అనుసంధానం

aadhaarcard-pan card
aadhaarcard-pan card


న్యూఢిల్లీ: ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. ఆధార్‌నంబరుతో పాన్‌ కార్డు అనుసంధానానికి మార్చి 31 తుది గడవు కాగా ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఐటి అధికారులు ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు గుర్తుచేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్‌ -పాన్‌ అనుసంధానం తప్పనిసరి అని అధికారులు మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ లేదా ఈ-ఫైలింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఈ అనుసంధానం చేసుకోవచ్చు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/