ప్రతిరోజు 3కోట్లకు పైగా ఆధార్ అభ్యర్థనలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆప్ ఇండియా (యూఐడిఎఐ) శుక్రవారం తెలిపింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. ప్రతి రోజు 3 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్థనలు నమోదవుతున్నట్లు తెలిపింది. అలాగే ఆధార్ వివరాల ఆప్డేట్ అభ్యర్థనలు కూడా రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల మేర వస్తున్నాయని పేర్కొంది. ఆధార్ వ్యవస్థ ప్రారంభం నుంచి 37,000 కోట్ల సార్లు ఉపయోగించబడినట్లు తెలిపింది. 331 కోట్ల బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ఆధార్ అప్ డేట్స్ చేసినట్లు తెలిపింది. ఇప్పటికి ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లక్షల మేర ఆధార్ అప్ డేట్స్ అభ్యర్థనలు వస్తున్నట్లు తెలిపింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/