గుంటూరు జిల్లాలో దారుణం
కేసు పెట్టేందుకు వచ్చిన యువతిపై ఎస్‌ఐ అత్యాచారం

గుంటూరు: ఏపిలో కఠినమైన దిశా చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ అత్యాచారాలు ఆగడం లేదు. నిత్య ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. దిశా చట్టంతో మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసే కామాంధుడిగా మారాడు. మేమున్నామంటూ అండగా ఉండాల్సిన రక్షక భటుడే బరితెగించాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలిపై ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు చెప్పిన కథనం ప్రకారం.. తన ప్రియుడు డేవిడ్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి అరండల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐతే ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదుచేయకుండా ఆ యువతిని ట్రాప్ చేశాడు. విచారణ పేరుతో ఇంటికి పిలిపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అటు అదే స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ రాము యువతి తల్లిని లాడ్జికి రమ్మని పిలిచినట్లు సమాచారం. న్యాయం కోసం వెళ్తే పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలీసులతో పాటు డేవిడ్‌ను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/