విశాఖ ను రాజధాని చేయాలంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం

A young man attempted suicide to make Visakhapatnam the capital

Community-verified icon


ఏపీలో రాజధాని అంశంపై వాడివేడిగా నడుస్తుంది. అమరావతినే రాజధానిని చేయాలనీ అక్కడి రైతులు , టీడీపీ నేతలు ర్యాలీ లు చేపడితే..వైస్సార్సీపీ శ్రేణులు మాత్రం మూడు రాజధానులకే మొగ్గు చూపిస్తూ ర్యాలీ లు , రాజీనామాలు చేస్తున్నారు. గురువారం అనకాపల్లి జిల్లా చోడవరంలో వికేంద్రీకరణకు మద్దతుగా ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. విశాఖ ను రాజధాని చేయాలంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది.

ధర్మ శ్రీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.. మానవహారంగా ఏర్పడి విశాఖ ను రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ, నిరసన అనంతరం శ్రీనివాసరావు అనే యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని బైక్‌కు నిప్పు పెట్టాడు. తర్వాత తనకు నిప్పు పెట్టకోనే ప్రయత్నం చేశాడు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అడ్డుకున్నారు.. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన శ్రీనివాసరావుని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావును చీఫ్ విప్ కరణం ధర్మశ్రీ పరామర్శించారు.