ట్రోఫీలను విక్రయించి విరాళం ఇచ్చిన యువ గోల్ఫ్‌ పేయర్‌

పిఎం-కేర్స్‌ కు రూ.4,30లక్షలు ఇచ్చిన అర్జున్‌ భాటి

arjun bhati
arjun bhati

దిల్లీ: దేశంలో కరోనా నివారణకు విరాళం అందించటానికి భారత యువ గోల్ఫ్‌ ప్లేయర్‌ అర్జున్‌ భాటి తను సాధించిన ట్రోఫీలను విక్రయించాడు. ట్రోఫీలను విక్రయించగా వచ్చిన రూ.4.30 లక్షలను పిఎం-కేర్స్‌ కు విరాళంగా ఇచ్చాడు. కేవలం 15 సంవత్సరాల వయస్సులోనే తన గొప్ప మనసును చాటుకుని అందరికి ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం దేశం కఠినమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దేశానికి వీలైనంత సాయపడాలని అనుకున్నా. వెంటనే గత కొన్ని సంవత్సరాలుగా సాధించిన 102 ట్రోఫీలను విక్రయించగా వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చాను అని అర్జున్‌ భాటి తెలిపాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/