సభను నిరంతరాయంగా నడుపుతున్న ఓం బిర్లా!

Om Birla
Om Birla


న్యూఢిల్లీ: లోక్‌సభలో తరచూ వినబడే వాక్యాలు మాననీయ్‌ సదస్య్‌ గణ్‌ అని, శూన్య్‌ కాల్‌ అని, స్థగణ్‌ ప్రస్తావ్‌ అని వినిపిస్తున్నాయి. 17వ లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఓం బిర్లా కొత్త ఒరవడికి నాంది పలికారు. అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయాలను పక్కనపెట్టి అనేక పమార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో తరచూ వాయిదాలు. సభ్యులు సభా వ్యవహారాలను అడ్డుకోవడం లాంటి చర్యలతో సభకు ఆటంకం ఏర్పడి సభాసమయం వృధా అయ్యేది. కాని బిర్లా సభను సుదీర్ఘంగా సభను కొనసాగిస్తున్న తీరును చూస్తుంటే పలువురికి ముచ్చటేస్తుంది. ఆయన మధ్యాహ్న భోజన విరామాన్ని సైతం పక్కన పెట్టి, సభాపతి స్థానంలో ఎక్కువ సమయం ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఐతే తొలిసారిగా గెలిచిన వారికి మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. సభను నడపడంలో మీరు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు అని సభలో ఇటీవల ఓ తృణమూల్‌ ఎంపి వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం. తమ నియోజకవర్గాల్లోని సమస్యల్ని లేవనెత్తడం కోసం కొత్త ఎంపీలకు అవకాశం కల్పిస్తూ బుధవారం జీరో అవర్‌ని గంటపాటు పొడిగించారు. చాలా సందర్భాల్లో ఆయన హిందీ భాషనే ఉపయోగిస్తున్నారు. అలాగే సభో మాట్లాడే అవకాశం ఇవ్వడం పట్ల సభ్యులు సభాపతికి కృతజ్ఞతలు తెలిపే అవసరం లేదని స్పష్టం చేశారు. దాన్ని అవకాశంగా భావించి ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి కృషి చేయాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/