వచ్చే ఏడాదిలోగా కరోనా నిర్మూలనకు టీకా

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి

Harsh Vardhan
Health Minister Harsh Vardhan

New Delhi: వచ్చే ఏడాదిలోగా కరోనా నిర్మూలనకు టీకా వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు.

ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన దేశంలో ప్రతి రోజూ పదిహేను వేల కరోనా కేసులు నమోదౌతున్నాయన్నారు.

అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనాపై పోరాటంలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదేనని సూత్రీకరించిన ఆయన దీని పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

కరోనా సోకకుండా జీవన శైలిని మార్చుకోవాలన్నారు. 

భారత్ కరోనా టీకాపై పరిశోధనలు చేస్తున్నదని ఆయన చెప్పారు. యోగా గురు రాందేవ్ బాబా విడుదల చేసిన కరైనల్ మందుపై ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తున్నదని  అన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/