పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

పాఠశాల భవనం పైనుంచి దూకి అఘాయిత్యం

tenth grade student commits suicide
tenth grade student commits suicide

తిరువూరు(కృష్ణా జిల్లా): పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. కృష్ణా జిల్లాలోని తిరువూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. విజన్‌ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జీవన్‌ మణికంఠ అనే విద్యార్థి హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే మైగ్రేన్‌ తలనొప్పి కారణంగా కొంతకాలంగా సదరు విద్యార్థి బాధ పడుతున్నట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. మృతి చెందిన బాలుడిది గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామం అని తెలిసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/