జమ్ము-కశ్మీర్‌లో పర్యటించిన రాయబారుల బృందం

Foreign Representatives
Foreign Representatives

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో స్థితిగతులను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు అమెరికా సహా 15 దేశాలకు చెందిన దౌత్య వేత్తల బృందం గురువారం కాశ్మీర్‌లో పర్యటించింది. అయితే ప్రభుత్వ మార్గదర్శనంలో పర్యటించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల రాయబారులు నిరాకరించారు. తమకు తాము స్వతహాగా, స్వేచ్ఛగా పర్యటించి పరిస్థితిని అంచనా వేసేందుకు దోహదం చేసేలా పర్యటన ఉండాలే మినహా ప్రభుత్వ మార్గదర్శనంలో, కనుసన్నల్లో పరిశీలన సాధ్యపడదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చూపేందుకు కేంద్రం చేస్తున్న విఫల ప్రయత్నంగా ఈ పర్యటనను ప్రతిపక్షాలు సైతం విమర్శించాయి. ఇదివరకే వివిద దేశాలకు చెందిన పచ్చి మితవాద ఎంపీల బృందాన్ని తీసుకొచ్చి కాశ్మీర్‌లో ఃఅంతా బాగుందిః అని చెప్పేందుకు మోడీ సర్కార్‌ ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో రెండోసారి దౌత్యవేత్తల సందర్శనకు ఏర్పాట్లు చేయడం విశేషం. జమ్ముకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం విదేశీ ప్రతినిధులు పర్యటించడం ఇది రెండోసారి. ఈ బృందంలో అమెరికాతో పాటు దక్షిణ కొరియా, మొరాకో, నైజర్‌, నైజీరియా, గుయానా, అర్జెంటీనా, నార్వే, ఫిలిప్ఫీన్స్‌, మాల్దీవులు, టోగో, ఫిజి, పెరూ, బంగ్లాదేశ్‌, వియత్నాం రాయబారులున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/