రేపటి నుండి చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన

తూర్పు గోదావరి నుంచి పర్యటన షురూ

ap cm Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం టిడిపి కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలనీ, పార్టీ కేడర్ లో ధైర్యం నింపాలని నిర్ణయించారు. ఈ నెల 5న చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభమవుతుందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబు అచ్చంపేటలోని కల్యాణ మండపంలో టిడిపి శ్రేణులతో సమావేశమవుతారనీ, నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా టిడిపి అధినేత క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమావేశమవుతారని పేర్కొన్నారు. అనంతరం కాకినాడలో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఇలా 13 జిల్లాల్లోనూ చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని చినరాజప్ప అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/