పర్వేజ్ ముషారఫ్ కు మరణశిక్ష

దేశద్రోహం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

parvej musharraf
parvej musharraf

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు పాకిస్థాన్ లోని ప్రత్యేక కోర్టు ఉరిశిక్షను విధించింది. దేశద్రోహం కేసులో ఆయనను దోషిగా తేల్చిన హైకోర్టు… మరణదండనే ఆయనకు తగిన శిక్ష అని తేల్చింది. ప్రస్తుతం ముషారఫ్ విదేశాల్లో తలదాచుకున్నారు. 2007లో ఎమర్జెన్సీకి సంబంధించి ముషారఫ్ తీసుకున్న నిర్ణయంపై పీఎంఎల్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయన దేశద్రోహం చేశారని నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది. మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్… ప్రస్తుతం అక్కడే తల దాచుకున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్… సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/