పరిపూర్ణ మానవ వికాసానికి దివ్య జ్ఞాన సమాజం

తత్వ జ్ఞానులు కొందరిలో అనిబిసెంట్‌ అగ్రగామి

Annie besant
Annie besant

మనిషి తన గురించి తాను తెలుసుకోవడమే తత్వజ్ఞానం అని అన్నారుపెద్దలు. తత్వ జ్ఞాన శాస్త్రం అంటే ఫిలాసఫీ.

ఫిలియాసోఫియా అనే రెండు గ్రీకు పదాల ద్వారా ఇది ఆవిర్భవించింది. ఫిలియా అంటే ప్రమే. సోఫియా అంటే జ్ఞానం. మనిషిలో చెలరేగే అంతరంగ భావాలతోపాటు, మనిషి కి లభించే ప్రాపంచిక దృక్పథాన్ని కూడా తత్వశాస్త్రం చర్చిస్తుంది బోధిస్తుంది.

లోకం అంతా ప్రేమయం. కడకు మనిషి కరుణా పూర్ణమైన ప్రేమమూర్తిగా మారడమే దివ్యలక్షణం. ప్రతివారు చరమాంకంలో ఈ జ్ఞానదశకు చేరుకోక తప్పదు. అదే మోక్షం అని వాదించేవారు చాలా మంది ఉన్నారు. కాదు ఈ విశ్వమంతా అగోచరమైన సత్యసాధనం.

నిత్యసాధన ద్వారా మాత్రమే జ్ఞాన సముపార్జన పొందగలం. ఆ మార్గంలో ఏదైతే అనుభవైక్యం కాగలదో అదే దివ్యత్వమని భావించేవారు కొందరే ఉన్నారు.

ఆ చలనశీలగతిలో నిబద్ధంగా ఎప్పటికప్పుడు నూతన విషయాలు నేర్చుకుంటూ, నేర్చుకున్నవి ఐదుగురితో పంచుకుంటూ జీవిత సార్థకతకు నిర్వచనం చెప్పి, బాహ్యప్రపంచానికి ఇతిమిద్దంగా చూపగలిగేవారు బహుకొద్దిమంది మాత్రమే ఉంటారు.

ప్రపంచమంతటా వేళ్లమీద లెక్కించగల ఈ తత్వజ్ఞ్ఞానులు కొందరిలో అనిబిసెంట్‌ అగ్రగామిగా నిలుస్తారు. 1847 అక్టోబరు 1న లండన్‌లో అనీ జన్మించింది. తల్లిదండ్రులు ఏమిలీమోరిస్‌. విలియంఉడ్‌. చిన్నతనంలోనే ఐదవ యేటనే అనీ తండ్రిని కోల్పోయింది.

నిరుపేద కుటుంబీకురాలైన తల్లి మోరిస్‌ కష్టజీవి. పాఠశాల విద్యార్థులకోసం హాస్టల్‌ నడిపేది. అనీ ఆ కష్టంలో పాలుపంచుకునేది. అప్పటి నుండే స్వేచ్ఛకు, సొంత భావాలకు ప్రాధాన్యతనిచ్చేది. దానికితోడు తల్లి స్నేహితురాలు మారియల్‌ చక్కటి విద్యాభ్యాసాన్ని అందించింది.

తన 19వ యేట 26 ఏళ్ల మతాధికారి ప్రాంక్‌ బిసెంట్‌తో అనీకి వివాహం అయింది. అప్పటి నుండి అనీబిసెంట్‌గా మారింది. యుక్త వయసులోనే అనీ ఐరోపా అంతటా పర్యటించింది. పలు భాషలు నేర్చుకున్నది. భర్తమిత్రు లతో సైతం నైతిక రాజకీయాల గురించి చర్చించేది.

వివక్షలేని సమానత్వం కోరుకోవడం ఆమె ఆలోచనల్లో అంతర్భా గమైంది. వాటిని ఆచరణలో పెట్టే క్రమంలో సహజంగానే ఘర్షణలు తలెత్తేవి. ఏరకమైన ఆధిపత్యాన్ని అయినా ప్రశ్నించడం ఆమె నైజంగా మారింది. పురుషాధిక్య వివాహచట్రంలో ఇమడలేక బయటకు వచ్చింది.

విడాకులు తీసుకున్నది. అప్పటికి ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగారు. మతం పురుషాధిక్యతను బలపర్చడాన్ని ఆమె ఏవగించుకున్నది.

మనశ్శాంతి కోసం మత గ్రంథాలను ఆశ్రయించినా ఆమెకు పరిష్కారం లభించలేదు. అనివార్యంగా హేతువాదానికి దగ్గరైంది. దృఢమైన వ్యక్తిత్వం, చొరవ, అసాధారణ ప్రతిభ కారణంగా ఆమె అనతికాలంలోనే గుర్తింపు పొందగలిగింది.

మహిళా హక్కుల ఉద్యమ కార్య కర్తగా, సత్యాన్వేషిగా, బ్రిటిష్‌ సోషలిస్టుగా పేరుపొందింది. ఫెబియన్‌ సొసైటీ ముఖ్యురాలిగా, సోషల్‌ డెమోక్రటిక్‌ ఫెడ రేషన్‌కు వక్తగా, లండన్‌ స్కూల్‌ బోర్డు డైరెక్టర్‌గా ఇలా ఏక కాలంలో పలు ప్రధాన భూమికలు పోషించారు ఆమె.

అలాగే మానవ హక్కుల సాధన కోసం నిరంతరం సమాంతరంగా ఉధృత పోరాటాలు నిర్వహిం చారు. జార్జిబెర్నాడ్‌షా, సిడ్నివెబ్‌ వంటి ఉద్దండుల సహచర్యం లభించింది.

1890లో అనీబిసెంట్‌కు దివ్య జ్ఞాన సంఘం థియె సాఫికల్‌ సొసైటీ వ్యవస్థాపకురాలు చ్లావెత్‌ స్కీతో పరిచయం ఏర్ప డింది. ఇదే అనీ జీవితంలో అతిపెద్ద మార్పు. థియోస్‌ అంటే గ్రీకు పదంలో దైవం అని అర్థం.

చ్లావెత్‌స్కీ మంచి రచయిత. ది సీక్రేట్‌ డాక్టరిన్‌, దివాయిస్‌ ఆఫ్‌ సైలెన్స్‌ అనే రెండు సుప్రసిద్ధ గ్రంథాలను ఆమె రచించారు. రూఢి అయ్యేంతవరకు అన్వేషణ సాగించాలి.

అనుభవైక్య మైన సిస లైన విజ్ఞానమే స్వీయ విముక్తికి రాచ బాటలు వేస్తుంది. ప్రతి వ్యక్తికి, జాతికి ఉన్నట్లే ప్రతి దేశానికి ఓ నిశ్శబ్ద సంగీత భాష ఉంటుంది.

అందులో విశ్వమానవతా సౌందర్యాన్ని అన్వేషిం చాలి. ఆ గ్రంథాల అధ్య యన సారాన్ని గ్రహిస్తూ పరులతో అభిభాషణ చేస్తున్న క్రమంలో సహ జంగానే అనీబిసెంట్‌ ఓ ప్రవక్తగా మారిపోయారు.

చ్లావెత్‌స్కీ మరణానంతరం దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలను అనీబిసెంట్‌ భుజానకెత్తుకున్నారు. విజ్ఞానాన్ని వ్యాప్తిచేసే క్రమంలో సాధ్యమై నన్ని విద్యాకేంద్రాలు స్థాపించడం ఆమెకు విధిగా మారింది.

అనీబిసెంట్‌ భారత పర్యటనకు వచ్చిన కొద్ది కాలానికే భారతీయ సంస్కృతి పట్ల ముగ్ధురాలైంది. భారతీయులు పాశ్చాత్య సంస్కృ తిని అనుసరించక్కర్లేదని, చాలా విషయాల్లో పాశ్చాత్యులే భారతీయ సంస్కృతిని అనుసరించాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

ఓబ్రిటిష్‌ మహిళ అయివ్ఞండి ఈ విధంగా మాట్లాడటం ఆనాటి బ్రిటిష్‌ పాలకులకు కంటగింపు అయింది. రకరకాలుగా బెదిరించారు.

అయినా వాటిని ఆమె లక్ష్యపెట్టలేదు. భారత స్వాతంత్రోద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చింది. భారతదేశం తన మాతృదేశం అని తాను భారతపౌరురాలు అని సగర్వంగా ప్రకటించుకుని కాంగ్రెస్‌ కార్యకర్తగా ఉద్యమంలో పాల్గొన్నది.

1902లో వారణాసి కేంద్రీయ హిందూకళాశాల స్థాపనకు ఎనలేని కృషి చేసింది. 1907లో దివ్యజ్ఞాన సంఘం అధ్యక్షురాలైంది.

అప్పటికే తమ సంఘ కేంద్ర కార్యాలయం చెన్నై అడయార్‌లో ఉన్నది. ఒకవైపు తాత్వికచింతన, మరోవైపు ఉద్యమకారిణిగా భౌతిక కార్యాచరణ.

ఈ జోడు గుర్రాల స్వారీ ఎప్పటికప్పుడు ముందుకు సాగుతూనే ఉన్నది ఆమె జీవితంలో. స్వాతంత్య్రం నా జన్మహక్కు అన్న బాలగంగాధర తిలక్‌తో కలిసి 1916లో హోంరూల్‌ లీగ్‌ను స్థాపించింది.

రెండు దేశాల మధ్య ఉండవల సింది విశ్వమానవ సౌభ్రాతృత్వం యూనివర్సల్‌ బ్రదర్‌హుడ్స్‌ ఉండాలే తప్ప ద్వేషం, శతృత్వం కాదని తేల్చి చెప్పింది. ఒక దేశాన్ని ప్రేమించడం అంటే ఆ దేశం భౌతికస్థితిగతులనే గాక, ఆదేశం ప్రజలను, ఆ దేశం ఆత్మసౌందర్యాన్ని, మానవీయ సంస్కృతిని ప్రేమించడం నేర్చుకోవాలని ఉద్ఘాటించారు.

1917లో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు కలకత్తాలో జరిగినప్పుడు ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు ఆమె. జాతీయ భద్రతా సంఘం నిర్వహించే జాతీయ సంస్కర్త పత్రికలో ఆమె స్ఫూర్తివంతమైన రచనలు రాసేవారు.

చైతన్యభావాలను రగిలించేవారు. త్రివరణ శుద్ధిగా నమ్మినవాటినే వ్యక్తపరిచేవారు. ప్రసంగాలు కూడా సాంద్రతతో గంభీరంగా సాగేవి.

ఆమె వాగ్ధాటి అనన్యసామాన్యం. అందుకే మహాత్మాగాంధీ భారతీయులను గాఢనిద్ర నుండి మేల్కొల్పిన ప్రభాత పాంచజన్యంగా అనీబిసెంట్‌ను అభివర్ణించారు. 1923లో అనీబిసెంట్‌ దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.

1933 సెప్టెంబరు 20న 76వ ఏట అస్తమించారు. అనంత విశ్వానికి భూమి కేంద్రం కాదని, విశ్వంలో అనేకానేక ప్రాణాలుంటాయని, విశ్వం యావత్తు ప్రాణశక్తితో స్పందిస్తున్నదని అది కంటికి కన్పించకపో యినా పదార్థంలా సత్యమని, 125 ఏళ్ల క్రితమే దివ్యజ్ఞాన సమాజం లోకానికి తెలపడం విశేషమే.

మానవుడు అంటేనే మనస్సుతో ఆలోచించేవాడు. మానవత్వసంపన్నుడు జ్ఞానం లేనివారు మాత్రమే ప్రలోభాలకు లోనవ్ఞతారు. భౌతికవాంఛలకు పరిమితం అవ్ఞతారు. వాటిని దాటుకుని తనలోని గాఢశక్తిని తెలుసుకోవాలి.

మానవీయతతో కూడిన ఆ దివ్య జ్ఞానమే భూత, భవిష్యత్‌, వర్తమాన త్రికాల విశ్వదర్శనం చేయగలదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం, మానవహక్కులు,మానవీయత హేతు వాదం, ఆత్మశోధన ఇలా అనేక ఉదాత్త ఆలోచనల ఆచరణల సమ్మిళిత సంగమమే అనీబిసెంట్‌ జీవితం.

దివ్యజ్ఞాన సమాజానికి పూలబాటలు పరిచింది. అదే పరిపూర్ణ మానవ వికాసానికి ఒకానొక రాచబాట అయిందనేది కాదనలేని సత్యం.

  • కె.శాంతారావు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/