మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై ముందస్తు సర్వే

Elections
Elections

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అక్టోబర్‌ 21 అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలపై కొన్ని సంస్థలు ప్రీపోల్‌ సర్వేలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లోను ప్రస్తుతమున్న వారే తిరిగి ముఖ్యమంత్రులవుతారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వేలు సెప్టెంబర్‌ 16 నుండి అక్టోబర్‌ 16 మధ్య నిర్వహించారు. హర్యానాలో 90 స్థానాలలో 59.8 శాతం మంది తిరిగి బిజెపినే అధికారంలోకి వస్తుందన్నారు. 15.8 శాతం మంది మాత్రం కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హర్యానాకు ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్‌ఖట్టర్‌ సరైన వ్యక్తి అని 40.3 శాతం ప్రజలు చెప్పారు. కాంగ్రెస్‌ నేత భూపేందర్‌సింగ్‌ హుడాకు 19.9 శాతం మంది మద్దతు పలికారు. ఇక 288 స్థానాలున్న మహారాష్ట్రలో 48.8 శాతం మంది బిజెపి అధికారంలోకి వస్తుందని చెప్పగా, 10.6 శాతం మంది మాత్రం కాంగ్రెస్‌ వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 11.3 శాతం మంది ఎన్సీపి అధికారంలోకి వస్తుంటున్నారు. బిజెపి, శివసేన మిత్రపక్షం అధికారంలోకి వస్తుందని 9 శాతం మంది చెప్పారు. ఒక 34.7 శాతం మంది ఫడ్నవీసే మళ్లీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఉద్ధవ్‌ థాక్రేకు 5.1 శాతం మంది మద్దతునిచ్చారు. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అయితే బాగుంటుందని 5.9 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/