ఇంట్లో ప్రతి గదిలో ఒక మొక్క

పచ్చదనంతో ఆరోగ్యము

A plant in every room in the house

ఇంట్లో పచ్చదనం విరిస్తే మనసుకి ఆహ్లాదం, ఆట విడుపుతో పాటు ఆరోగ్యం కూడా అయితే ఏ మొక్కల్ని ఎక్కడ పెంచాలి.. ఎలా పెంచాలి అనే అవగాహన ఉంటే చాలు. పచ్చదనంతో మనసుకి ఆహ్లాదం కల్గిస్తాయి.

వంటగదిని ఆనుకుని బాల్కనీ ఉంటే మెంతికూర, కొత్తిమీర పుదీనా వంటి ఆకుకూరలను పెంచాలి. తగినంత కాంతి అందినప్పుడు చక్కగా పెరుగుతాయి. ఇవి అవసరానికి సులువుగా ఉపయోగ పడతాయి.

చిన్న చిన్న కుండీలు, వాడిపడేసిన డబ్బాలు, ట్రేల్లో కూడా పెంచుకోవచ్చు. ముందుగదిలో ఇంట్లోకి వచ్చిన అతిథుల్ని ఆకట్టుకోవాలంటే ముందుగదిలో ఒకటిరెండు మొక్కలు ఉంటేనే బాగుంటుంది.

వెలుతురు సరిగా రాని చోట సులువుగా పెరిగే మొక్క ఎంచుకోవాలంటే నాసా గుర్తించిన మొక్కల్లో ఒకటి రెండు ఎంచుకోవచ్చు.

వాటిల్లో పీస్‌లిల్లీ, ఫిలడెండ్రాన్‌ వంటివి చూడ్డానికి బాగుంటాయి. గాలినీ శుద్ధిచేస్తాయి. హాల్లో సక్యులెంట్లతో రూపొందించిన చిన్న టెర్రారియంలను ఉంచుకోవచ్చు. బోన్సా§్‌ులు ప్రయత్నించవచ్చు.

బెడ్‌రూమ్‌లలో సువాసనతో పాటు ఆహ్లాదాన్ని అందించే మల్లె, గార్డేనియా వంటి రకాలను ఎంచుకోవాలి. బెడ్‌రూమ్‌లలో వెలుతులు సరిగ్గా ఉండేలా ఇళ్ల నిర్మాణంలో ఉంటోంది కాబట్టి వెలుతురు కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

బెడ్‌రూమ్‌ కిటికీ దగ్గర వెలుతురు పడేలా ఈ మొక్కలు పెట్టుకోవచ్చు. లేదంటే దాన్ని ఆనుకుని ఉంటే బాల్కనీల్లో పెంచుకోగలిగితే చాలు. ఇక అలంకరణకోసం లక్కీబాంబు, మనీప్లాంట్‌ వంటి వాటిని కూడా పెట్టుకోవచ్చు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/kids/