పారిస్ లో నడిరోడ్డు మీద కూలిన విమానం

ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువై పోతున్నాయి. టేకాఫ్ అవుతున్న సమయంలో కొన్ని..మధ్యలో కొన్ని సాంకేతిక లోపాలతో కూలిపోవడం , మంటలు రావడం జరుగుతున్నాయి. తాజాగా పారిస్ లో నడిరోడ్డు మీద విమానం కూలింది.

పారిస్ లోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై చిన్న ప్యాసింజర్ విమానం కూలిపోయింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుంది. గాయాలపాలైన వారిని ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.