నేడు విడుదల కానున్న అమ్మఒడి జాబితా

గ్రామ సచివాలయాల్లో మహిళల కిటకిట!

CM Jagan
CM Jagan

అమరావతి: ఏపిలో జగన్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో చూసుకునేందుకు పెద్ద సంఖ్యంలో తరలివచ్చారు. కాగా పలు ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. కాగా ఈ పథకంలో భాగంగా ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లులను ఈ జాబితాలో లబ్ధిదారులగా ప్రకటించారు. ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు అర్హుల జాబితాను తయారు చేయగా, మొత్తం 46,78,361 మందికి అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ జాబితాను విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలు, మార్పుల కొరకు జనవరి 2 వరకు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మార్పులు చేసిన జాబితాను జనవరి 9న విడుదల చేస్తారు. అనంతరం అదే రోజున తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు చొప్పున జమ చేస్తారు. కాగా ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు జరుగకూడదని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/