రాష్ట్ర రాజకీయాల్లో ఓ చారిత్రక నిర్ణయం

ఇదో శుభపరిణామం

gvl narasimha rao
gvl narasimha rao

అమరావతి: ఈ రోజు బిజెపి, జనసేన మధ్య కీలక సమావేశం ముగిసిన తర్వాత ఇరు పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఓ చారిత్రక నిర్ణయం జరిగిందని జీవీఎల్‌ ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడంలో ఇదో శుభ పరిణామమని అన్నారు. జనసేనతో కలిసి పోరాడుతూ రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయా శక్తిగా ఎదుగుతామని అన్నారు. బిజెపితో కలిసి నడిచెందుకు జనసేన నాయకుడు పవన్‌కళ్యాణ్‌ నిర్ణయించుకున్నందుకు జీవీఎల్‌ పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి అనేక రాష్ట్రాల్లో రెండు శాతం ఓట్ల నుంచి అధికారం వరకూ చేరగలిగిందని, ఏపీలో కూడా అలాంటి ప్రభంజనమే రాబోతుందని ఆశభావం వ్యక్తం చేశారు. కుల రాజకీయాలకు, కక్ష్య సాధింపు చర్యలకు, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి, జనసేన పనిచేస్తుందని చెప్పారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అజెండాగా కూటమి కొనసాగుతుందని జీవీఎల్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/