పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పు

విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక

Anemometer

ముఖ్యాంశాలు

  • నిన్నరాత్రి వాయుగుండంగా మారిన తుఫాన్‌
  • ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా ఉండే అవకాశం
  • ఇవాళ, రేపు కోస్తాంధ్రలో ఈదురుగాలులతో వర్షం పడే సూచన

Visakhapatnam:

తుఫాన్ ఎంఫాన్ ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న రాత్రి వాయుగుండం తుపానుగా మారిందని పేర్కొంది.

ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ దిశగా 1040 కిలీమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు నైరుతి దిశలో 1200 కీలోమీటర్ల , అలాగే బంగ్లాదేశ్ లోని ఖేపురకు దక్షిణ దిశగా 1300 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది.

ఇది మరింత బలపడి ఈ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.  తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా ఉండే అవకాశం లేదని పేర్కొన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

తీనం వెంబడి గంటకు 55 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయనీ,  తుఫాన్‌ బలపడుతున్న సమయంలో 80 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. 

 దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర, యానాంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో పాటు, తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది.

\తాజా సినిమా వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/