కరోనా కట్టడికి శ్రమిస్తున్న వారికి పూలాభిషేకం
పేదలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మే 7 వరకల్లా ఒక్క కరోనా కేసు కూడా ఉండదని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర ఆద్వర్యంలో చేతి వృత్తుల వారికి సరుకుల పంపిణీ చేశారు. కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్న స్థానిక అధికారలు, పారిశుద్ద్య సిబ్బందికి, ఆశా కార్యాకర్తలకు, పోలీసులకు, ఆయన పూలాభిషేక చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారని, వారు చేస్తోన్న సాయం అభినందనీయం అన్నారు. అలాగే లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న ఇక్కడి ప్రజలకు ఎమ్మెల్యే సండ్ర అండగా ఉంటూ నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/