సైనికుల సోదాల్లో దొరికిన ఆయుధాలు

weapons
weapons


మణిపూర్‌: మణిపూర్‌లోని నానీ జిల్లా కేక్రూ నాగ గ్రామంలో భారత సైన్యానికి చెందిన 57 మౌంటేన్‌ డివిజన్‌ బ్రిగేడర్‌ రవరూప్‌ సింగ్‌ నేతృత్వంలోని సైనికులు ఉగ్రవాదుల ఏరివేత కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున తుపాకులు, హ్యాండ్‌ గ్రెనేడ్లను గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో పలు చోట్ల దాచి ఉంచారు. సైనికుల సోదాల్లో నాలుగు రైఫిళ్లు, రెండు గ్రెనేడ్‌ లాంచర్లతోపాటు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి దొరికింది. ఉగ్రవాదులు తుపాకులు చూపించి కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారని సైనికుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు దాచి ఉంచిన ఆయుధాలనున స్వాధీనం చేసుకున్న సైనికులు వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/