విజృంభిస్తున్న కరోనా వైరస్‌

కరోనావైరస్‌ వ్యాప్తిచెందుతున్న ప్రాంతా లలో పర్యటిస్తున్న వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖానికి మాస్క్‌ ధరించాలి. వైరస్‌వ్యాప్తి చెందుతున్న ఆయా ప్రాంతాలలోని కోళ్లఫారాలు, జంతుసంరక్షణశాలలు, కబేళాల దగ్గరకు వెళ్లకూడదు. ఇప్పుడు ఆయా దేశాల నుండి స్వదేశం వచ్చినవారు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే మన భారత ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలలో అప్రమత్తత చర్యలు ప్రారంభించింది. వైరస్‌సోకినవారు, అనుమానితులు ఇతరులకు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా ఖర్చిఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి. తరచు చేతులను శుభ్రం చేసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

corona virus

వ్యాధులను కలి గించే ముఖ్యంగా ఒకరి నుండిమరొకరికి వ్యాప్తిచెందే అంటు వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ జీవ్ఞలలో పారాసైట్‌లు,బ్యాక్టీరియా, ఫంగస్‌లు, వైరస్‌లు ప్రధానమైనవి. (వీటన్నింటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మైక్రోబయాలజిగా పేర్కొంటారు) వీటిలో వైరస్‌ వ్యాధులకు తప్ప, మిగతా అన్ని రకాల సూక్ష్మజీవ్ఞల వ్యాధులకు పూర్తి చికిత్స లభ్యమవ్ఞతోంది. వైరల్‌ వ్యాధులకు యాంటివైరల్‌ మందులు కొన్ని వచ్చినా అవి పూర్తిస్థాయిలో శరీరంలో ప్రవేశిం చిన వైరస్‌లను నిర్వీర్యం చేయలేకపోతున్నాయి. అయితే శరీరం లోని ఆ వైరస్‌ల సంఖ్యాబలం పెరగకుండా నిరోధించగలుగుతు న్నాయి. ఇప్పటికీ చాలా వైరల్‌ వ్యాధులను వాటి అంతట అవే తగ్గే ‘సెల్ఫ్‌లిమిటింగ్‌ వ్యాధులగానే పరిగణించాల్సి వస్తోంది. వైరస్‌ అనే పదానికి లాటిన్‌ భాషలో ‘విషం అని అర్థం. ఇవి జీవకణాలలో మాత్రమే సజీవంగా ఉంటాయి.

వైరస్‌లు మొక్క లలో, జంతువ్ఞలలో, మనుషులలో వివిధ రకాల వ్యాధులకు కారణమవ్ఞతున్నాయి. ఈ వైరస్‌లను వాటిలోని జన్యుపదార్థం ఆధారంగా డి.ఎన్‌.ఎ వైరస్‌లు, ఆర్‌.ఎన్‌.ఎ వైరస్‌లు అని రెండురకాలుగా విభజించడం జరిగింది. వైరస్‌ల జన్యుపదార్థం స్థిరంగా ఉండదు. తరచు ఉత్పరివర్తన (మ్యుటేషన్స్‌)లకు గురి అవ్ఞతూ కొత్తకొత్త వైరల్‌ స్ట్రెయిన్స్‌ ఉద్భవిస్తూ ఉంటాయి. ఒకప్పుడు మానవ్ఞలలో వ్యాధులనే కలుగచేయని, లేదా స్వల్ప అస్వస్థతకు కారణమయ్యే వైరస్‌లు ఉత్పరివర్తనల కారణంగా ఇప్పుడు ప్రాణాంతక వ్యాధులకు కారణమవ్ఞతున్నాయి. వాతా వరణంలోని మార్పులు కూడా ఉత్పరివర్తలకు దోహదపడుతు న్నాయి. అందువల్లనే గత దశాబ్దకాలంగా ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రాణాంతక వైరల్‌వ్యాధులు విజృంభిస్తున్నాయి.

వీటిలో డెంగ్యూ, సార్స్‌, బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, జపనీస్‌ఎస్‌సెఫలైటిస్‌, మెర్స్‌, ఎబోలా, ఎయిడ్స్‌, హెపటైటిస్‌,చికిన్‌గున్యా వంటి వైరస్‌ లు పేర్కొనదగినవి. ప్రస్తుతం చైనాలో కరోనావైరస్‌ విజృంభిస్తోం ది. ఈ వైరస్‌ ఇప్పటికే ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. విమాన ప్రయాణాలు అందరికి అందుబాటులోకిరావడం, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగి పోయిన నేపథ్యంలో వైరల్‌ వ్యాధులు,అతి తక్కువకాలంలోనే ఖాండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా అలజడినిసృష్టిస్తున్నాయి.

కరోనా వైరస్‌లను 1937వ సంవత్సరంలోనే గుర్తించడం జరి గింది. ఈ వైరస్‌లు ఎక్కువగా జంతువ్ఞలలో ముఖ్యంగా కోళ్లు, చుంచెలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు,గుర్రాలు, పందులు, ఆవ్ఞలు, గెదలు, గబ్బిలాలు, ఒంటెలలో ఊపరితిత్తుల వ్యాధులకు కారణమవ్ఞతున్నాయి. కొన్ని రకాల కరోనావైరస్‌లు మానవ్ఞలలో కూడా కామన్‌ఫ్లూ ఫీవర్‌ వంటి స్వల్పకాలిక వ్యాధులకుకారణమవ్ఞ తున్నాయని 1960లోనే గుర్తించారు.

కాలక్రమేణా ఈ వైరస్‌లలో ఉత్పరివర్తనలు జరిగి శక్తివంతమైన ప్రాణాంతక వైరస్‌లుగా మారాయని వైద్యపరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు రకాల హ్యమన్‌కరోనా వైరస్‌లను గుర్తించడం జరిగింది. వీటిని 229ఇ-అల్ఫాకరోనావైరస్‌, ఒసి43, బీటాకరోనావైరస్‌, హెచ్‌కెయుఐ బీటాకరోనా వైరస్‌, సార్స్‌ కరోనావైరస్‌, మెర్స్‌ కరోనావైరస్‌, నోవెల్‌ కరోనా వైరస్‌లుగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చైనాలోని వూహన్‌ నగరంలో విజృంభిస్తున్న వైరస్‌ను ‘నోవెల్‌ కరోనావైరస్‌గా పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌లను, వైరస్‌ల వర్గీకరణలో కరోనా వైరిడియేకుటుంబానికి, అందులోనూ కరోనా వైరినే ఉపకుటుంబానికి చెందినదిగా పేర్కొనడం జరిగింది. ఈ కరోనా వైరస్‌లలో మరలా అల్ఫా, బీటా,గామా, డెల్టా జాతు లను గుర్తించడం జరిగింది.

ఈ కరోనా వైరస్‌ ఆర్‌.ఎన్‌.ఎ.వైరస్‌ ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో పరీక్షించినప్పుడు ఈ వైరస్‌ ‘క్రౌన్‌ లేదా హేలో ఆకారంలోని స్పైక్స్‌ను కలిగి ఉండడంవల్ల ఈ వైరస్‌కు కరోనావైరస్‌ అని పేరు పెట్టడం జరిగింది. లాటిన్‌ భాషలో కరోనా అంటే ‘క్రౌన్‌ అని అర్థం. కరోనా వైరస్‌ మానవ్ఞలలో ముఖ్యంగా ఊర్థ్వశ్వాసకోశ (అప్పర్‌ రేస్పిరేటరీ ట్రాక్ట్‌-యు.ఆర్‌.టి) వ్యాధులకు, జీర్ణాశయవ్యాధులకు గురి చేయడాన్ని గుర్తించారు. అయితే ఇవి చాలా స్వల్పకాలిక సెల్ఫ్‌లిమిటింగ్‌ వ్యాధులు. ఈ వైరస్‌ సోకినవారిలో జలుబు (కామన్‌కోల్డ్‌-రన్నింగ్‌ నోస్‌), గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలుంటాయి.

ఈ వ్యాధులను శీతాకాలంలోనూ, వేసవికాలం ప్రారంభంలోనూ ఎక్కువగా గుర్తిం చడం జరుగుతోంది. మానవ్ఞలలో వ్యాధులకు కారణమవ్ఞతున్న ఆరు రకాల కరోనా వైరస్‌లలో కొన్ని రకాల వైరస్‌లు ఊర్థ్వశ్వాస కోశం నుండి కిందగల శ్వాసనాళాలు, శ్వాసకోశాలకు వ్యాప్తి చెంది శ్వాసనాళాలు, ఊపిరితిత్తులను వ్యాధిగ్రస్తం చేస్తున్నాయి. ప్రత్యక్షం గా వైరల్‌ బ్రాంకైటిస్‌, న్యూమోనియాలకు కారణమవ్ఞతుండగా, మరికొందరిలో పరోక్షంగా సెకండరీ బ్యాక్టీరియల్‌ బ్రాంకైటిస్‌కు, న్యూమోనియాకు కారణమై ప్రాణాంతకమవ్ఞతున్నాయి.

ఇప్పటి వరకు రెండురకాల ప్రాణాంతక కరోనావైరస్‌ వ్యాధులను మనం చూడడం జరిగింది. వాటిలో మొదటిది సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(ఎస్‌.ఎ.ఆర్‌.ఎస్‌) సార్స్‌కాగా రెండోది మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (ఎం.ఇ.ఆర్‌.ఎస్‌)మెర్స్‌. సార్స్‌వైరస్‌ 2003లో ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించిన విషయంచాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యాధి 8090 మందికి సోకగా అందులో774మంది మరణించారని ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాలు తెలుపుతున్నాయి. 2012లో సౌది అరేబియాలో ‘మెర్స్‌ను గుర్తించడం జరిగింది. 2013లో ఆ దేశంలో 124 మంది వైరస్‌ సోకినట్లు నమోదుకాగా అందులో 52 మంది మర ణించారు.

2014లో అమెరికాలోను, 2015లో కొరియాలోనూ మెర్స్‌ను గుర్తించారు. 2019 డిసెంబరు వరకు ప్రపంచవ్యాప్తంగా 2,468కేసులు నమోదు కాగా అందులో 851 మంది మరణించా రని అధికారనివేదికలు తెలుపుతున్నాయి.2020 జనవరిలో చైనా లోని వూహన్‌ నగరంలో కొంతమందిలో సివియర్‌ ఎక్యుట్‌రెస్పి రేటరీ ఇన్‌ఫెక్షన్‌(ఎస్‌.ఎ.ఆర్‌.ఐ)నుగుర్తించడం జరిగింది. కారణాల ను అన్వేషించగా, ఒకరకమైన కరోనా వైరస్సే అందుకు కారణమ ని తేలింది. ఈ వైరస్‌ ‘నోవెల్‌ కరోనావైరస్‌ అని పేరు పెట్టారు. దీనినే వూహన్‌ కరోనా వైరస్‌అని, న్యూమోనియాను, వూహన్‌ న్యూమోనియా అని కూడా పిలుస్తున్నారు.

హ్యుమన్‌ కరోనా వైరస్‌లు, వైరస్‌ సోకిన వ్యక్తులనుండి ఇతరులకు వ్యాప్తి చెందుతా యి.వైరస్‌ వ్యాప్తిచెందడంలో ముక్కులనుండి, నోటినుండి స్రవించేస్రావాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.వైరస్‌ సోకిన వ్యక్తులు తుమ్మడం, దగ్గడం వల్ల వెలువడే లాలాజలతుంపరల ద్వారా వైరస్‌ వ్యాప్తిచెందుతోంది. ఆ తుంపరలతో కలుషితమైన దుస్తులు, ఇతర వస్తువ్ఞలు,కరచాలనం,తాకడంవల్ల,వైరస్‌ ఒకరి నుండి మరొ కరిలోకి ప్రవేశిస్తుంది.వైరస్‌సోకిన రెండు లేదా మూడు రోజుల లోనే లక్షణాలు బయటపడతాయి. అంటే ఇంక్యుబేషన్‌ పిరియడ్‌ చాలా తక్కువగా ఉంటుంది.

వ్యాధిలక్షణాలను మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌ లక్షణాలుగా విభజించడం జరిగింది. మైల్డ్‌, మోడరేట్‌ లక్షణాలలో ముక్కులనుండి స్రావాలుకారడం,దగ్గు,తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం,నిస్సత్తువ వంటి ఫ్లూజ్వరం, కామన్‌కోల్డ్‌ లాంటి లక్షణాలుంటాయి. వైరస్‌లు శ్వాసనాళాలు, శ్వాసకోశలకు వ్యాపించినప్పుడు బ్రాంకైటిస్‌,న్యూమోనియా లక్షణాలు బయట పడతాయి.తీవ్రజ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.

ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధకశక్తి, తక్కువగలవారిలోనూ,అవయాలు మార్పిడి చేయించు కున్న వారిలోనూ,క్యాన్సర్‌ బాధితులలోనూ,ఎయిడ్స్‌ బాధితుల లోనూ,ఎక్కువకాలం విచక్షణారహితంగా స్థెరాయిడ్స్‌ వాడిన వారి లోనూ, ఊపిరితిత్తుల వ్యాధుల బాధితులలోనూ, చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రెగ్నెంట్‌ స్త్రీలలో ఎక్కువగా ఈ సినియర్‌వ్యాధి లక్షణా లను గుర్తించడం జరుగుతోంది.ముక్కుగొంతుల నుండి వెలువడే స్రావాలను, రక్తాన్ని పరీక్షించడం ద్వారా కరోనావైరస్‌ల ఉనికిని గుర్తించవచ్చు.కరోనా వైరస్‌ వ్యాధులకు,ఇతర అనేక వైరస్‌ వ్యాధు లలానే ప్రత్యేకమైన చికిత్సఏమీలేదు.వ్యాక్సిన్‌ కూడా లేదు. వ్యాధి లక్షణాలకు ఉపశమనచికిత్సమాత్రమే చేయగలం.మంచినీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసు కోవాలి.లక్షణాలను గుర్తిస్తేవెంటనే వైద్యున్ని సంప్రదించాలి.కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న ప్రాంతా లలో పర్యటిస్తున్న వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధిపట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

ముఖానికి మాస్క్‌ ధరించాలి. వైరస్‌వ్యాప్తి చెందుతున్న ఆయా ప్రాంతాలలోని కోళ్లఫారాలు, జంతుసంరక్షణశాలలు, కబేళాల దగ్గరకు వెళ్లకూడదు. ఇప్పుడు ఆయా దేశాల నుండి స్వదేశం వచ్చినవారు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇప్ప టికే మన భారత ప్రభుత్వం అన్ని విమానాశ్రయాలలో అప్ర మత్తత చర్యలు ప్రారంభించింది. వైరస్‌సోకినవారు, అనుమాని తులు ఇతరులకు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా ఖర్చిఫ్‌ను అడ్డుపెట్టు కోవాలి. తరచు చేతులను శుభ్రం చేసుకోవాలి.

  • డాక్టర్‌. టి. సేవకుమార్‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/