ఎనిమిదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి

దేశంలో మహిళలకే కాదు అభం శుభం తెలియని చిన్నారులకు సైతం రక్షణ లేకుండా అవుతుంది. ఒంటరిగా మహిళా కనిపించిన , చిన్నారి కనిపించిన కామాంధులు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న పెద్దపల్లి లో ఆరేళ్ళ చిన్నారి ఫై అత్యాచారం చేసి..హత్య చేసిన ఘటన మరచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో చోటుచేసుకుంది.

అభం శుభం తెలియని చిన్నారిపై మూడు రోజుల క్రితం తాత వరస అయిన వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలియజేయడంతో వారు సుల్తానాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.