9వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

9th Pashuram Thiruppavai
9th Pashuram Thiruppavai

తూమణిమాడత్తుశుత్తుమ్‌ విళక్కెరియ
తూపమ్‌ కమళ త్తుయిలణై మేల్‌ కణ్‌ వళరుమ్‌
మామాన్‌మగళే! మణిక్కదవమ్‌ తాళ్‌ తిఱవాయ్
మామీర్‌! అవళై యెళుప్పీరో, ఉన్‌మగళ్‌ దాన్‌,
ఊమైయో? అని€ చ్చెవిడో, అనన్దలో?
ఏమ ప్పెరున్దుయిల్‌ మన్దిరప్పట్టాళో?
మామాయన్‌ మాదవన్‌ వైగున్దన్‌ ఎనెయ్
నామమ్‌ పలవ్ఞమ్‌ నవినే€లో రెమ్బావాయ్
తొమ్మిదవ పాట
మణుల మించిన మణుల
మణులెన్నో పొదిగిన
మఱిమయంబైనట్టి మంటపాన
సాంబ్రాణి ధూపాలు మాణిక్యదీపాలు
మరి మరీ వెలిగేటి మందిరానా
హంసతల్పముపైన పవళించియున్నట్టి
మామకూతురలెమ్మ! తలుపు తీయగరమ్మ
మూగదో, చెవిటిదో, మంత్రించి ఉన్నదో
పరమాత్మ తలపుల, పలుకలేకున్నదో
దేవాది దేవ్ఞని వైకుంఠవాసుని
శ్రీలక్ష్మిపతిని, శ్రీరంగనాథుని
శతసహస్రనామాలు పాడి ప్రార్థిస్తాము
అత్తనీ కూతురిని తట్టిలేపమా!
భావం: భవనము మంచి మణులతో నిర్మింపబడినది. ప్రకాశవంతమైన దీపములు, అగరుధూపముల పరిమళము, అన్ని సమయములలో నిదురించుటకు అనువైన పడక. దానిపై నిదురించుచున్నది. కృష్ణుని మేనమామ కూతురైన ఓ గోపిక. ఆ గది తలుపులు మణులతో నిర్మించబడినవి. వెలుపలి గోపికలు లోపలి గోపికను గొళ్లెము తీయమని కోరుతున్నారు. ఆమె తల్లిని ”నీ కూతురు మూగదా? చెవిటిదా? రోగి ష్టిదా? గాఢనిదుర వచ్చునట్లు మంత్రం వేశారా? అడుగుతున్నారు. మహామా యావి అయిన కృష్ణుణ్ణి ఓ వైకుంఠవాసా, ‘మాధవా అని కీర్తించి,
ఆ గోపికను లేపమని కోరుతున్నారు.
ఫలం: భక్తి కలుగుతుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/