ఏపి ఎమ్మెల్యెల్లో 94 శాతం మంది కోటీశ్వరులు

ap
ap

హైదరాబాద్‌: ఏపి ఎమ్మెల్యెల్లో 94 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. అయితే మొత్తం 175 మంది ఎమ్మెల్యెలకు గానూ 163 మంది ఎమ్మెల్యెలు కోట్లలో ఆస్తులు కలిగినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ ప్రకటించింది. కాగా వీరిలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యెలె అధిక సంఖ్యలో ఉన్నారు. అయితే సగటున ఒక్కో ఎమ్మెల్యే ఆస్తి రూ. 27.87 కోట్లు అని ఏడీఆర్‌ వెల్లడించింది. మాజీ సీఎం చంద్రబాబు ఆస్తులు రూ. 668 కోట్లు కాగా, వైఎస్‌ జగన్‌ ఆస్తులు రూ. 510 కోట్లు. వైఎస్సార్‌సీపీ నుంచి 140 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేల ఒక్కొక్కరి ఆస్తులు రూ. కోటి పైగానే ఉన్నాయని ఏడీఆర్‌ తెలిపింది.


తాజా సినీమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/