9355 పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు

P.S.
P.S.

జెఎన్‌టియు ద్వారా పోస్టుల భర్తీ, డిగ్రీ అర్హత
హైదరాబాద్‌: ఖాళీగా ఉన్న 9355 పంచాయతీరాజ్‌ కార్యదర్శి పోస్టల భర్తీకి నోటిఫికేషన్‌ తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు సోమవారంనాడు పంచాయతీరాజ్‌ కార్యదర్శి పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేశారు. జెఎన్‌ టియు ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు 44 ఏళ్ల వయస్సు దాటకుండ ఉన్న వారు, డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో 12,751 గ్రామ పంచాయితీలు ఉండగా, అందులో ప్రస్తుతం 3562 మంది పంచాయితీరాజ్‌ సెక్రటరీలు మాత్రమే ఉన్నారు. మిగతా పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, 200 జనాభా ఉన్న ప్రతి గ్రామానికి కార్యదర్శి తప్పనిసరి అని సిఎం కెసిఆర్‌ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒక కార్యదర్శి మరో పంచాయతీకి ఇన్‌చార్జీగా ఉండే విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. పోలీసు ఉద్యోగాల తర్వాత భారీ ఉద్యోగాల భర్తీ పంచాయితీరాజ్‌ శాఖలోనే జరుగనున్నాయి. నూతనంగా ప్రవేశపెట్టిన జోనల్‌ వ్యవస్థను కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో నూతన జోనల్‌ వ్యవస్థ విధానం మేరకే పోస్టుల భర్తీ ఉంటుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే, నూతన జోనల్‌పై గెజిట్‌ విడుదలవుతుంది. ఈ ప్రక్రియ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్స్‌ వరుసగా విడుదల చేయనుంది.