ఇరాన్‌లో 92 మంది కరోనా మృతులు

ప్రభుత్వంలో అగ్రనాయకులకు వైరస్

Iran -coronavirus
Iran -coronavirus

టెహరాన్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) కారణంగా ఇరాన్‌లో 92 మరణించినట్లు ఇరాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతినిధి కయానౌష్ జహాన్‌పోర్ తెలిపారు. మరో 2,922 మందికి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయినట్టు టెహరాన్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కయానౌష్ జహాన్‌పోర్ ఈ సమాచారం అందిచారు. మధ్యప్రాచ్యంలో, ఇరాన్ వెలుపల ఇప్పుడు 3,140 కరోనా కేసులు ఉన్నాయి. ఆ దేశాలు చాలావరకు ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ పొరుగు దేశాలే. ఇరాన్ ప్రభుత్వంలో అగ్రనాయకులకు కూడా వైరస్ సోకింది. చైనా తర్వాత ఇంత ఉధృతంగా ఈ వైరస్ ఎలా వ్యాపించిందో తెలీక ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇరాన్‌లో కరోనా కేసులు ఇంకా ఎక్కువే అని, ప్రభుత్వం కావాలని లెక్కలు తగ్గించి చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీ కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ ఖఇరాన్‌లో మొత్తం 31 ప్రావిన్స్‌ల్లో ఈ వైరస్ ఉంది. విస్తృతంగా వ్యాపించే లక్షణం దీనికుందిగ అన్నారు. ఇది ప్రపంచ వ్యాధి అని, ప్రపంచంలో చాలా దేశాలు దీని బారిన పడ్డాయని, సాధ్యమైనంత త్వరగా దీన్ని నిర్మూలించేందుకు మనమంతా కృషి చేయాలని ఇరాన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/