దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823
మొత్తం మృతుల సంఖ్య 3,63,079

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దేశంలో కొత్తగా 91,702 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం… నిన్న 1,34,580 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823కు చేరింది. మరో 3,403 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,63,079కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,77,90,073 మంది కోలుకున్నారు. 11,21,671 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24,60,85,649 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,42,42,384 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,44,131 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/