90కి చేరిన టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య!

TRS
TRS

మంత్రి కేటిఆర్‌ను కలిసిన రామగుండం ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే చందర్‌-టిఆర్‌ఎస్‌కు మద్దతు !
టిఆర్‌ఎస్‌తో చేరుతానని ప్రకటించిన వైరా ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే రామలు నాయక్‌
హైదరాబాద్‌: అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిన 88 స్థానాలకు అదనంగా ఇద్దరు ఇండిపెండెంట్లు అభ్యర్థుల కూడా ఆపార్టీలో చేరనున్నారు. దీంతో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరనుంది. ఈనేపథ్యంలో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన కోరుగంట చందర్‌ సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. ఈసందర్బంగా ఆయన టిఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి కేటిఆర్‌కు..చందర్‌ తెలియజేశారు. ఎన్నికలకు ముందు వరకు టిఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉన్నానని, ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేశానని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ తన మాతృసంస్థ అని చందర్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేస్తానని ఈసందర్బంగా చందర్‌ ప్రకటించారు.
వైరా కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి కూడా టిఆర్‌ఎస్‌ వైపు చూపు?!
కాగా ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా పోటీచేసిన విజయం సాధించిన లావుడ్యా రాములు కూడా టిఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆయన టిఆర్‌ఎస్‌ నేతలను కలసి ఆపార్టీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది.